తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం
- January 09, 2025
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.
మృతులకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్రేషియా ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.
తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. గాయపడ్డవారిని రుయా, స్విమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు అయింది. నారాయణవనం తహశీల్దార్ ఫిర్యాదు మేరకు.. ఈస్ట్ పీఎస్లో BNS 194 సెక్షన్ కింద కేసు నమోదు అయింది.
తిరుమలలో తొక్కిసలాట ఘటనతో అలర్ట్ అయిన టిటిడి శుక్రవారం వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఎలాంటి అపశృతి జరగకుండా చర్యలు తీసుకుంటుంది టీటీడీ. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా.. ఏడు కొండలను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. పూలను తెచ్చి.. శ్రీవారి ఆలయంతోపాటూ..చుట్టుపక్కల ఆలయాల్ని అలంకరించారు. తిరుమలలో లైటింగ్, ఎలక్ట్రిసిటీని కూడా సరికొత్తగా మార్చారు.
శుక్రవారం ఉదయం ముందుగా శ్రీవారి ఆలయాన్ని తెరిచిన తర్వాత ఏకాంతంగా స్వామి
వారికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఏకాంతంగా అభిషేకం చేస్తారు. ఆ తర్వాత ఉదయం నాలుగున్నర నుంచి భక్తులకు స్వామివారి దర్శనంకు అనుమతిస్తారు. దేశంలో HMPV వ్యాధి సోకుతోంది కాబట్టి.. భక్తులు మాస్కులు ధరించి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని టీటీడీ సూచించింది. టోకెన్లు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







