ఫార్ములా-1 2025 సీజన్ కోసం ఖతార్ ఎయిర్వేస్ ఫ్యాన్ ప్యాకేజీలు..!!
- January 09, 2025
దోహా: ఫార్ములా 1 గ్లోబల్ పార్ట్నర్ , అఫీషియల్ ఎయిర్‌లైన్ గా ఉన్న ఖతార్ ఎయిర్వేస్.. F1 75వ వార్షికోత్సవం సందర్భంగా 2025 ఫ్యాన్ ప్యాకేజీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అభిమానులు రాబోయే F1 సీజన్ కోసం తమ సీట్లను బుక్ చేసుకోవాలని కోరింది. 2024 ఖతార్ GP కి దాదాపు 150,000 కంటే ఎక్కువ మంది అభిమానులు హాజరయ్యారు. రెడ్ బుల్ మాక్స్ వెర్స్టాపెన్ 2024 F1 ప్రపంచ ఛాంపియన్ ను గెలుచుకున్నాడు. నవంబర్ 28-30 (2025) వరకు ఐకానిక్ లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జరుగుతాయి.
ఫ్యాన్ ప్యాకేజీలు నాలుగు విభాగాలను కలిగి ఉంటాయి: మెయిన్ గ్రాండ్‌స్టాండ్, నార్త్ గ్రాండ్‌స్టాండ్, T16 గ్రాండ్‌స్టాండ్, జనరల్ అడ్మిషన్ లుసైల్ హిల్. అన్ని ప్యాకేజీలు qatarairways.com/f1 లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలు ప్రారంభం నుండి చివరి వరకు అభిమానులను ఉత్తేజపరిచేలా రూపొందించారు. అభిమానులు ఖతార్ ఎయిర్‌వేస్‌తో దోహాకు వెళ్లి ప్రపంచంలోని ప్రముఖ 4 లేదా 5-నక్షత్రాల హోటల్లో బస చేస్తారు. అల్పాహారంతో సహా కనీసం మూడు రోజులపాటు ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్యాకేజీలు మోటార్‌స్పోర్ట్ ఔత్సాహికులకు రేసులో ముందు వరుస సీట్లను కేటాయిస్తారని ఖతార్ ఎయిర్వేస్ హాలిడేస్ & డిస్కవర్ ఖతార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్టీవెన్ రేనాల్డ్స్ తెలిపారు. గత సంవత్సరం అభిమానుల ట్రావెల్ ప్యాకేజీల విజయంతో.. దాదాపు ఒక సంవత్సరం ముందుగానే 2025 కోసం ప్యాకేజీలను ప్రారంభించడం పట్ల థ్రిల్‌గా ఉన్నామని, F1 ఔత్సాహికులు ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి సురక్షితంగా ఉండటానికి చాలా సమయాన్ని ఇస్తాయని పేర్కొన్నారు.
సూపర్ ఎర్లీ బర్డ్ ప్రమోషన్లు గరిష్టంగా 20% పొదుపులతో ఫిబ్రవరి 12వరకు అందుబాటులో ఉంటాయని, తర్వాతి దశ ఎర్లీ బర్డ్ ప్రమోషన్ 10% వరకు పొదుపును ఫిబ్రవరి 13 నుండి మార్చి 19వరకు ప్రారంభించబడుతుందని పేర్కొన్నారు. మరింత సమాచారం కొసం వెబ్ సైట్ qatarairways.com/f1 ను సందర్శించాలని సూచించారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







