కువైట్-చెన్నై ఫ్లైట్‌లో చాలా మంది ప్రయాణీకుల లగేజీ మిస్..!!

- January 09, 2025 , by Maagulf
కువైట్-చెన్నై ఫ్లైట్‌లో చాలా మంది ప్రయాణీకుల లగేజీ మిస్..!!

కువైట్: కువైట్ - చెన్నై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో వందలాది మంది ప్రయాణికులు చెన్నై చేరుకున్న తర్వాత వారి లగేజీని కోల్పోయారు. కువైట్ నుండి ఎయిర్ ఇండియా విమానం మంగళవారం రాత్రి సుమారు 176 మంది ప్రయాణికులతో చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. ఇమ్మిగ్రేషన్ తర్వాత, వారు తమ లగేజీ కోసం కన్వేయర్ బెల్ట్ వద్ద వేచి ఉన్నారు. 12 మంది ప్రయాణికులు మాత్రమే లగేజీని స్వీకరించారు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ.. "పేలోడ్ పరిమితుల కారణంగా, సోమవారం కువైట్-చెన్నై సెక్టార్‌లో నడుస్తున్న విమానంలో కొన్ని చెక్-ఇన్ బ్యాగేజీలను తరలించలేకపోయాము. మా అతిథులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రభావితమైన లగేజీ సంబంధిత అతిథుల నివాసాలకు వీలైనంత త్వరగా, ఎయిర్‌లైన్ ఖర్చుతో డెలివరీ చేస్తాం." అని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com