అన్ని టెకెట్లకు మీ టికెట్ యాప్..
- January 09, 2025
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవలను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా “మీ టికెట్” యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా వివిధ రకాల టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆర్టీసీ, మెట్రో, ఆలయ దర్శనం, జూ పార్కులు, బోటింగ్, మ్యూజియంలు, వినోదం టిక్కెట్లు ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ (ESD) రూపొందించిన అధునాతన ‘మీ టికెట్’ యాప్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి తరహా యాప్ లను మరిన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
ఈ యాప్ లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ పార్క్, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఈ యాప్ లొకేషన్ ఆధారిత సిఫార్సులను అందిస్తుంది… ఈ ఫీచర్ ద్వారా సమీపంలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల వంటి GHMC సౌకర్యాల కోసం బుక్ చేసుకోవచ్చు అని అన్నారు. ఈ యాప్ లో UPI చెల్లింపులు కూడా చేయవచ్చు… అందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని వెల్లడించారు.
తాజా వార్తలు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...
- 'పెడల్ ఫర్ పింక్' సైక్లథాన్ కార్యక్రమం నిర్వహణ
- దుబాయ్‌లో తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- సామూహిక విధ్వంసక ఆయుధాలపై ఖతార్ ఆందోళన..!!
- రియాద్‌లో అటానమస్ వాహనాలకు డిమాండ్..!!
- దక్షిణ అరేబియా సముద్రంలో వాయుగుండం..!!
- రేడియేషన్ ప్రమాదాలపై కువైట్ వార్నింగ్..!!
- దుబాయ్ రన్ 2025.. టైమింగ్, రూట్స్ వివరాలు..!!
- స్పేస్ యాప్స్ ఛాలెంజ్..బహ్రెయిన్ పై నాసా ప్రశంసలు..!!
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!







