డెలివరీ యాప్‌ల టాప్ షాపర్‌.. 475 బల్క్ ఆర్డర్‌.. Dh6,800 బిల్లు చెల్లింపు..!!

- January 10, 2025 , by Maagulf
డెలివరీ యాప్‌ల టాప్ షాపర్‌.. 475 బల్క్ ఆర్డర్‌.. Dh6,800 బిల్లు చెల్లింపు..!!

యూఏఈ: ఒక దుబాయ్ నివాసి 2024లో ఒక ప్రముఖ కిరాణా డెలివరీ యాప్‌లో Dh6,800 కంటే ఎక్కువ విలువైన ఒక కిరాణా ఆర్డర్‌ని ఇచ్చారు. కరీమ్ గ్రోసరీస్‌పై ఆర్డర్ 475 హోమ్, ప్యాంట్రీ ఐటెమ్‌ల బల్క్ ఆర్డర్‌ను ఇచ్చారు.ఆర్డర్ వస్తువులన డెలివరీ చేసేందుకు అనేక మంది డెలివరీ బాయ్‌లు తరలివవచ్చారు. ఈ మేరకు యాప్ వివరాలను విడుదల చేసింది. 2024లో తరచుగా కొనుగోలు చేసే వ్యక్తి 988 ఆర్డర్‌లను ఇచ్చాడు. యాప్‌లో కిరాణా సామాగ్రి కోసం Dh42,000 కంటే ఎక్కువ ఖర్చు చేశాడు. మరొకరు గతేడాది ఆగస్టులో ఒకే రోజు 16 వేర్వేరు ఆర్డర్లు ఇచ్చారు. యూఏఈలో అత్యంత ప్రజాదరణ పొందిన డెలివరీ సమయం రాత్రి 7 గంటలుగా ఉంది.

కోవిడ్ మహమ్మారి నుండి యూఏఈలో ఆన్‌లైన్ షాపింగ్, స్పీడ్ కిరాణా డెలివరీ సేవలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. 2020 నుండి నెలవారీ ఇ-కామర్స్ దుకాణదారులలో 140 శాతం పెరుగుదలతో, ఎమిరేట్స్ లోని వినియోగదారులు ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారని గత సంవత్సరం యూఏఈ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.   

గత సంవత్సరం కరీమ్  ఫుడ్ లో సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ అయిన సిర్వ్ మేనా Dh1,000 కంటే ఎక్కువ విలువైన 83 ఆర్డర్‌లు చేయడం ద్వారా సింగిల్ డే రికార్డును నెలకొల్పాడు. ప్రముఖ భాగస్వామ్య మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన అడ్మిటాడ్ 2024 మొదటి త్రైమాసికంలో డెలివరీ ఆర్డర్‌లలో సంవత్సరానికి 10 శాతం పెరుగుదల నమోదవుతుందని వెల్లడించింది. డేటా ప్రకారం, యూఏఈ రెస్టారెంట్లు సంవత్సరానికి 228,740 ఆర్డర్‌లతో మిలియన్ల కొద్దీ డెలివరీ ఆర్డర్‌లను అందుకున్నాయి. ఒక్కో రెస్టారెంట్‌ లో Dh32 మిలియన్ల అమ్మకాలు జరిగాయి. డెలివరీలో ప్రత్యేకత కలిగిన ఫాస్ట్ ఫుడ్ చైన్‌లలో Dh126 మిలియన్ల విక్రయాల జరుగగా, డెలివరీ ఆర్డర్‌ల సంఖ్య 600,000 కంటే ఎక్కువ చేరుకుంది. ఇన్-యాప్ డైనింగ్ డిస్కవరీ, డిస్కౌంట్ ఫీచర్ కెంపిన్స్‌కి ది పామ్‌లో Dh25,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీని నమోదు చేసింది. కస్టమర్ ఒక్క సందర్శనలో Dh7,000 కంటే ఎక్కువ ఆదా చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com