మసీదుల ముందు సరిగా పార్క్ చేయాలి

- June 29, 2016 , by Maagulf
మసీదుల ముందు సరిగా పార్క్ చేయాలి

మసీదులు ముందు తమ తమ  వాహనాలను సరిగా  పార్కింగ్ చేయాలని  దుబాయ్ పోలీసులు వాహనదారులను కోరారు. దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్  కల్నల్ సైఫ్ ముహార్  అల్ మజ్రౌయి మాట్లాడుతూ , మసీదులు ముందు సరిగ్గా పార్క్ చేయాలని  వాహనదారులకు  పిలుపునిచ్చారు. అలాగే  రహదారి మధ్యలో వారి కార్లును నిలిపి ఉంచడం వలన అస్తవ్యస్త  పార్కింగ్ మరియు రాత్రి సమయంలో  ఇతర వాహనదారుల మార్గంను  నిరోధించడం ద్వారా మసీదులు చుట్టూ గందరగోళం సృష్టించడం సరికాదని ఆయన వివరించారు.  .అస్తవ్యస్త  ట్రాఫిక్ ని  క్రమబద్ధీకరించడానికి  మసీదుల చుట్టూ గస్తీని తీవ్రతరం చేస్తున్నామని  అదేవిధంగా ట్రాఫిక్ నియమాలను  ఉల్లంఘించినవారిపై జరిమానాలు విధిస్తున్నట్లు కల్నల్ అల్ మజ్రౌయి చెప్పారు . మసీదులు సమీపంలో అక్రమ పార్కింగుల కారణంగా దుబాయ్ లో అన్ని రోడ్లపై ట్రాఫిక్ గందరగోళం, రద్దీ ఏర్పడటానికి కారణమవుతుంది అని ఆయన తెలిపారు. ఈ తరహా పార్కింగుల  కారణంగా  పౌర రక్షణ శాఖ  మరియు అంబులెన్సులకు పని కల్పిస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారి గూర్చి వివరాలు, అలాగే ట్రాఫిక్ నిబంధనల్ని ఖాతరు చేయనివారి వ్యవహారం గూర్చి "  మనం అంతా...పోలీసులమే ( వుయ్ ఆర్ ఆల్ పోలీస్') అనే కార్యక్రమం కింద  800-4353  ఫోన్ నంబర్ కు  ప్రజలు పిర్యాదు చేయవచ్చని ఆయన కోరారు.

        

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com