గ్లోబల్ హెల్త్‌కేర్ ర్యాంకింగ్.. టాప్ 20లో ఖతార్..!!
- January 12, 2025
దోహా: ఖతార్ గ్లోబల్ హెల్త్‌కేర్ ర్యాంకింగ్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి.. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతంలోని దేశాల కంటే ఎక్కువ పాయింట్లను స్కోర్ చేసింది. ఈ మేరకు నంబియో హెల్త్ కేర్ ఇండెక్స్ 2025లో వెల్లడించారు. జనవరి 2024లో 73 పాయింట్లు సాధించిన 22వ స్థానంలో ఉన్న ఖతార్.. తాజాగా 73.4 స్కోర్‌తో 97 దేశాల ర్యాంకింగ్‌లో 18వ స్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో టాప్ 20 జాబితాలోకి వచ్చిన ఏకైక దేశం ఖతార్ కావడం గమనార్హం.
ఖతార్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండటం కోసం ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించిందని అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఖతార్ పై నమ్మకాన్ని ఇది నిరూపించిందని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, సేవలు, వనరుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది.
GCC దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హెల్త్ కేర్ ఇండెక్స్‌లో 70.6 పాయింట్లతో 29వ స్థానంలో ఉంది. ఒమన్ 65.1 పాయింట్లతో 46వ స్థానంలో నిలిచింది. సౌదీ అరేబియా 61.8 స్కోర్‌తో 55వ స్థానంలో.. కువైట్ 58.4 పాయింట్లతో 67వ స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్స్‌లో ఆసియా దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. తైవాన్ 86.5 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, దక్షిణ కొరియా 82.8 స్కోరుతో రెండవ స్థానంలో ఉంది. జపాన్ 80 స్కోరుతో మూడో స్థానంలో, నెదర్లాండ్స్ 79.3 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ నాలుగు దేశాలు 2024లో కూడా వరుసగా టాప్ ర్యాంక్‌లను పొందాయి.
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భాగమైన ఫ్రాన్స్ 77.7 స్కోర్‌తో ఏడవ స్థానంలో, 77.3తో 10వ స్థానంలో స్పెయిన్, ఆస్ట్రేలియా 73.4తో 19వ స్థానంలో ఉంది. యునైటెడ్ కింగ్డమ్ 72.7తో 21వ స్థానంలో ఉంది. జర్మనీ 71.9 స్కోరుతో 24వ స్థానంలో ఉంది. 68.7 స్కోరుతో 32వ స్థానంలో చైనా, యునైటెడ్ స్టేట్స్ 67.8 స్కోర్‌తో 38వ స్థానంలో ఉన్నాయి. భారత్ 65.5 పాయింట్లతో 44వ స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







