ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం
- January 13, 2025
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందించే ‘రిపబ్లిక్ డే సేల్ 2025’ను ప్రారంభించింది. జనవరి 14న (మంగళవారం) ప్రారంభమై 6 రోజులపాటు కొనసాగనున్న ఈ సేల్… ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ మెంబర్స్‌కు ఇవాళ్టి (సోమవారం) నుంచే అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, దుస్తులు, బ్యూటీ ప్రొడక్టులతో పాటు అనేక రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ మెంబర్స్‌కు 24 గంటల ముందే భారీ డిస్కౌంట్ డీల్స్ ఆకట్టుకుంటున్నాయి.
స్మార్ట్ఫోన్ల పై భారీ డిస్కౌంట్
స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు ‘ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్-2025’లో భాగంగా భారీ తగ్గింపు ఆఫర్లపై ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. పలు రకాల స్మార్ట్ఫోన్లపై 50 శాతం వరకు డిస్కౌంట్లు పొందవచ్చు.
యాపిల్, సామ్సంగ్, మోటరోలా, నథింక్, విడో, రియల్మీ, ఒప్పో వంటి ప్రముఖ బ్రాండ్ల ఫోన్లపై కూడా డిస్కౌంట్ డీల్స్ దక్కించుకోవచ్చు. స్మార్ట్ టీవీలపై కూడా భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్, స్పోర్ట్స్, మేకప్ వస్తువులపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉంటాయని పేర్కొంది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







