భారత రూపాయి ఇంకా పతనమవుతుందా? లాభమా..నష్టమా?

- January 13, 2025 , by Maagulf
భారత రూపాయి ఇంకా పతనమవుతుందా? లాభమా..నష్టమా?

యూఏఈ: ఈ సంవత్సరం భారత రూపాయి యూఏఈ దిర్హామ్‌కు 26 కంటే తక్కువగా పడిపోవచ్చు లేదా డాలర్‌కు 90కి చేరవచ్చు. ఇటీవలి వారాల్లో రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది ఒక దిర్హామ్‌కు 23.689 లేదా యూఎస్ డాలర్‌కి 85.97 కు చేరింది. RBI తన కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో కరెన్సీపై తన గట్టి పట్టును సడలించాడని మార్కెట్లో వార్తలు చక్కర్లు కొడుతుంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో రూపాయి విలువ మరింత పతనం అవుతుందని భావిస్తున్నారు

జనవరి 10న బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం.. డాలర్‌తో పోలిస్తే రూపాయి 86.04 వద్ద రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుని 85.9728 వద్ద ముగిసింది. నిరంతర విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) ఉత్సాహం, చమురు దిగుమతిదారుల నుండి బలమైన డాలర్ డిమాండ్, బ్రెంట్ క్రూడ్ ధరలలో పెరుగుదల, యూఎస్ ట్రెజరీ ఈల్డ్‌లు పెరగడం ఇవన్నీ కరెన్సీ క్షీణతకు దోహదపడ్డాయి.  ఈ తరుగుదల ఇండియా దిగుమతి-భారీ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా అధిక చమురు ధరలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో బలహీనమైన రూపాయి వాణిజ్య ఎగుమతుల వృద్ధికి సహాయపడుతుందని, దేశ ఎగుమతి ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని గవేకల్ రీసెర్చ్ విశ్లేషకులు ఉదిత్ సికంద్, టామ్ మిల్లర్ తెలిపారు.   కాగా, ప్రస్తుతం రూపాయి విలువ తగ్గడం కారణంగా ఆర్బీఐ వద్ద విదేశీ మారకనిల్వలు సుమారు $70 బిలియన్లు పడిపోయాయని పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com