పినార్ చీజ్ వినియోగం సురక్షితమేనా?
- January 16, 2025
దోహా, ఖతార్: పినార్ బ్రాండ్ చీజ్ వినియోగంపై సోషల్ మీడియా వేదికగా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. చీజ్ ప్రొడక్షన్ డేట్ 17/11/2024, ఎక్సిపిరేషన్ డేట్ 16/05/2035 ఉత్పత్తులకు E-కోలి వైరస్ సోకిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఉత్తత్పులను ల్యాబ్ లో పరిక్షించినట్లు తెలిపింది. అందులో ఎలాంటి వైరస్ బయటపడలేదని, అవి వినియోగానికి సురక్షితమని వెల్లడించింది. అత్యున్నత భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉందని, ఖతార్‌లోని అన్ని ఆహార ఉత్పత్తులు కఠినమైన ఆరోగ్య నియంత్రణకు లోబడి ఉంటాయని మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. ఫేక్ సమాచారాన్ని కలిగి ఉండే ఎలాంటి వార్తలను షేర్ చేయవద్దని, ఏవైనా వార్తలు లేదా అప్‌డేట్‌ల కోసం అధికారిక ఛానెల్‌లను చూడాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







