జోర్డాన్ పోలీసుల అదుపులో సౌదీ పౌరుడిని చంపిన వ్యక్తి..!!
- January 17, 2025
అమ్మాన్: జోర్డాన్‌లోని కరక్లోని గవర్నరేట్‌లో మంగళవారం సౌదీ పౌరుడు హత్యకు గురయ్యాడు. అతడిని కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారైన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఉన్న వివాదంతోనే హత్య చేసినట్టు నిందితుడు విచారణ సందర్భంగా తెలిపాడు. మృతుడు జబెన్ అల్-షమ్మరి(48) ఉత్తర సరిహద్దు ప్రాంతంలోని రఫా గవర్నరేట్‌కు చెందినవారు. అతను ఇటీవల జోర్డాన్ పర్యటనలో భాగంగా కరక్ లో ఉండగా దుర్ఘటన జరిగింది.
జోర్డానియన్ పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ ప్రతినిధి కల్నల్ అమెర్ అల్-సరటావి మాట్లాడుతూ.. నేరానికి పాల్పడిన వ్యక్తి బాధితుడిని కత్తితో పొడిచిన తర్వాత సంఘటన స్థలం నుండి పారిపోయాడని తెలిపారు. దుండగుడిని వెంబడించేందుకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, కరక్ పోలీస్ డైరెక్టరేట్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాయన్నారు. మృతుడితో పాటు మరికొందరితో వివాదాలు, కేసుల నేపథ్యంలోనే నేరం చేసినట్లు దుండగుడు అంగీకరించాడు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం నేరస్థుడిని హై క్రిమినల్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు సూచించినట్లు ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







