దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?

- January 17, 2025 , by Maagulf
దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?

యూఏఈ: మీరు దుబాయ్, అబుదాబిలో రాత్రి సమయంలో పనిచేయాలనుకునే ఉద్యోగులకు నైట్ వర్క్ పర్మిట్ అవసరం. సాధారణంగా రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల మధ్య పని చేయడాన్ని నైట్ వర్కింగ్ అవర్స్ అంటారు. పర్మిట్ కార్మికుల భద్రతతోపాటు కార్మిక చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటుంది. ప్రతి ఎమిరేట్ ఈ అనుమతిని పొందే ప్రక్రియను క్రమబద్ధీకరించింది. ఇది గతంలో కంటే ఇప్పుడు వేగంగా, సరళంగా పూర్తవుతుంది.  దుబాయ్‌లో నైట్ వర్క్ పర్మిట్ అప్లికేషన్‌లో సూచించిన ప్రారంభ తేదీ నుండి 14 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. దుబాయ్‌లో అనుమతి పొందడానికి కేవలం ఒక పని దినం మాత్రమే పడుతుంది.

అవసరమైన పత్రాలు
దుబాయ్ పోలీస్ వెబ్‌సైట్‌లో ఫారమ్‌ను పూర్తి చేయాలి. ఫారమ్‌కి ఎమిరేట్స్ ID, ఇమెయిల్ చిరునామాలు, కాంట్రాక్ట్ కంపెనీ పేరు, వర్క్ టైప్, షాప్ పేరు వంటి వివరాలు అవసరం.

సేవా రుసుములు:
సేవా రుసుము: Dh100
నాలెడ్జ్ ఫీజు: Dh10
ఇన్నోవేషన్ ఫీజు: Dh10
సేవా రుసుమును నగదు రూపంలో, డెబిట్ కార్డ్ (మాస్టర్, వీసా) ద్వారా లేదా Apple Pay ద్వారా చెల్లించవచ్చు.

అనుమతి కోసం..
దుబాయ్ పోలీస్ యాప్ (iOS మరియు Android)
దుబాయ్ పోలీస్ వెబ్‌సైట్
స్మార్ట్ పోలీస్ స్టేషన్లు
పోలీస్ స్టేషన్లు

మీ వ్యాపారం అబుదాబిలో ఉన్నట్లయితే, తాత్కాలిక సాయంత్రం వర్క్ పర్మిట్‌ను పొందేందుకు అదనపు ఖర్చులు ఉండవు. నాలుగు గంటల్లో పర్మిట్ జారీ చేస్తారు. ట్రేడ్ లైసెన్స్‌లు, వర్కర్ IDలు మరియు రెసిడెన్సీలు తప్పనిసరిగా చెల్లుబాటులో ఉండాలి. యూఏఈ PASSని ఉపయోగించి లాగిన్ కావాలి.  లేదా సేవా కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తు, అవసరమైన పత్రాలను సమర్పించాలి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com