కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- January 17, 2025
కువైట్ సిటీ: "ఏట్నా అమెరికా" ఒప్పందానికి సంబంధించిన నష్టానికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మాజీ అధికారులు సంయుక్తంగా $88 మిలియన్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ సివిల్, కమర్షియల్ విభాగం తీర్పునిచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతివాదుల నుండి $88.5 మిలియన్ల (లేదా కువైట్ దినార్లకు సమానం) సామూహిక పరిహారాన్ని కోరింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంత్రిత్వ శాఖ, ప్రజా నిధులకు ఆర్థిక, ప్రతిష్టకు నష్టం వాటిల్లిందని పేర్కొంది. వీటితోపాటు 5,001 కువైట్ దినార్ల తాత్కాలిక పౌర పరిహారం, కోర్టు ఖర్చులు, న్యాయవాది రుసుములను ప్రతివాదులు చెల్లించాలని తీర్పులో ఆదేశించారు. జనవరి 4, 2015న సంతకం చేసిన ఒప్పందంలో అంగీకరించిన కమీషన్ కు అనధికారికంగా అధికారులు 2.5% జోడించి, ఆ మేరకు నిధులను పక్కదారి పట్టించారు. దీంతో దీనిపై కేసు నమోదైంది. రాష్ట్ర నియంత్రణ అధికారుల అవగాహన లేదా ఆమోదం లేకుండా ఈ సర్దుబాటు చేశారని, ఫలితంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని కోర్టు నిర్ధారించింది. ప్రభుత్వ నిధులను కాజేయడం, నియంత్రణ పరిధికి మించి అధికారులు నిర్ణయాలు తీసుకుని ఆర్థిక నష్టానికి కారణం అయ్యారని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







