ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- January 18, 2025
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక పాత్ర వహిస్తుంది. ఉగ్రవాద గ్రూపులు, వారి మద్దతుదారులపై పోరాటం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు, సమాజాల భద్రతకు పొంచివున్న ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి అన్ని అంతర్జాతీయ ప్రయత్నాలనకు యూఏఈ మద్దతుగా నిలుస్తుంది. పెరుగుతున్న తీవ్రవాద ముప్పు గురించి హెచ్చరించిన మొదటి దేశాలలో యూఏఈ ముందువరుసలో ఉంది. దానిని ఎదుర్కోవడానికి, నిర్మూలించడానికి ప్రాంతీయ, ప్రపంచ సహకారాన్ని కోరారు. ఇది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలకు మద్దతుగా ఉంటుంది.
యెమెన్‌లో చట్టబద్ధ పాలనను పునరుద్ధరించడానికి సంకీర్ణంలో యూఏఈ ముఖ్యమైన పాత్ర పోషించింది. మార్చి 2015లో ప్రారంభించబడిన ఆపరేషన్ డెసిసివ్ స్టార్మ్‌లో యాక్టివ్ మెంబర్ గా ఉంది. యెమెన్‌పై ఆధిపత్యం చెలాయించే హౌతీ తీవ్రవాద మిలీషియాల ప్రణాళికలను అడ్డుకోవడంలో యూఏఈ సాయుధ దళాలు కీలక పాత్ర పోషించాయి. గల్ఫ్ ఆఫ్ అడెన్, బాబ్ అల్ మాండెబ్ జలసంధిపై నియంత్రణ ద్వారా పొరుగు దేశాలను, అంతర్జాతీయ సముద్ర నావిగేషన్‌ను బెదిరించేందుకు వాడుకున్నారు. హౌతీలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు యూఏఈ దళాలు యెమెన్‌లోని అల్ ఖైదా, డేష్‌లకు తీవ్ర నష్టం చేశాయి. తదనంతరకాలంలో అనేక నగరాలు, వారి నియంత్రణ నుండి విముక్తి పొందడంలో యూఏఈ పాత్ర వెలకట్టలేనిదని ప్రకటించారు. తీవ్రవాదం, మతోన్మాదానికి ప్రత్యామ్నాయంగా శాంతిని నెలకొల్లేందుకు ప్రాంతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. వీటిలో జూలై 2015లో సావాబ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం, డేష్‌ను ఓడించేందుకు గ్లోబల్ కోయలిషన్‌కు మద్దతిచ్చే ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ మెసేజింగ్ సర్వీస్ ను ప్రారంభించారు. జూలై 2014లో యూఏఈ అబుదాబిలో ముస్లిం కౌన్సిల్ ఆఫ్ ఎల్డర్స్‌ను ప్రారంభించింది. ఇస్లామిక్ ప్రపంచంలో శాంతిని పెంపొందించే లక్ష్యంతో మొదటి స్వతంత్ర అంతర్జాతీయ సంస్థగా ఇది అవతరించింది. డిసెంబరు 2012లో యూఏఈ హిదయ్ - ది ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కౌంటర్ ఎక్స్‌ట్రీమిజం, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రారంభించింది. తద్వారా వ్యక్తులలో రాడికల్ భావజాలాన్ని లేదా హింసాత్మక తీవ్రవాదంలో చేరకుండా నిరోధించడానికి ఈ కేంద్రం ప్రపంచ భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్‌పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్‌లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!