గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- January 18, 2025
విజయవాడ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయవాడ గన్నవరం ఏర్పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు.. కూటమి నేతలు స్వాగతం పలికారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అమిత్ షా వెళ్లనున్నారు.ఈ రోజు రాత్రి చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నివాసంలో జరిగే విందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
చంద్రబాబు నివాసంలో విందు సమావేశం అనంతరం అమిత్ షా ఈ రాత్రి విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్నారు.రేపు (జనవరి 19న) ఏపీలో జరిగే ఎన్డీఆర్‌ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు అమిత్ షా హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!