నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ

- January 18, 2025 , by Maagulf
నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ

అమరావతి: ఏపీలోని పలు నియోజకవర్గాలకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సమన్వయకర్తలను నియమించారు. ఐదుగురు సమన్వయకర్తలతో పాటు ఒకరికి నియోజకవర్గ పరిశీలకుని హోదా, మరొకరికి పార్టీ రాష్ట్ర ప్రతినిధి హోదా కల్పించారు.

అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలిగా కరణం ధర్మశ్రీని నియ‌మించ‌గా.. అశోక్ బాబుకు పార్టీ రాష్ట్ర ప్రతినిధిగా అవకాశం దక్కింది.

నియోజకవర్గ సమన్వయకర్తలు వీరే...

  • చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్.
  • మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడు.
  • భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను).
  • గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డి.
  • పి.గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గన్నవరపు శ్రీనివాస రావు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com