సౌదీలో వారం రోజుల్లో 21,485 మంది అరెస్ట్..!!

- January 19, 2025 , by Maagulf
సౌదీలో వారం రోజుల్లో 21,485 మంది అరెస్ట్..!!

రియాద్: సౌదీ అరేబియా భద్రతా దళాలు గత వారం రోజుల్లో మొత్తం 21,485 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశాయి. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టయిన వారిలో 13,562 మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినవారు, 4,853 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించినవారు, 3,070 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినవారు ఉన్నారు. సౌదీ సరిహద్దులు దాటుతతూ 1,568 అరెస్టయ్యారు.  వీరిలో 47 శాతం మంది యెమెన్ జాతీయులు, 50 శాతం ఇథియోపియన్ జాతీయులు, మూడు శాతం ఇతర జాతీయులకు చెందినవారు ఉన్నారు.  అక్రమ నివాసితులకు సహకరించిన 16 మందిని కూడా అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం 25,164 మంది ఉల్లంఘించినవారు ప్రయాణ పత్రాలను పొందేందుకు వారి దౌత్య కార్యాలయాలకు సిఫార్సు చేయగా, 2864 మందిని ప్రయాణ రిజర్వేషన్‌లకు సిఫార్సు చేయగా, 11,955 మందిపై బహిష్కరణ వేటు వేశారు. చట్టాలను ఉల్లంఘించి అక్రమార్కులకు సహాయం అందించిన వారికి గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్షతోపాటు SR1 మిలియన్ వరకు జరిమానా విధించబడుతుందని  అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.  మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లోని ప్రాంతాలలో 911 నంబర్‌కు..  కింగ్‌డమ్‌లోని మిగిలిన ప్రాంతాలలో 999, 996 నంబర్‌ల ద్వారా ఉల్లంఘనలను నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com