అబుదాబిలో జంక్ ఫుడ్‌ నిషేధం..స్కూల్స్, క్యాంటీన్‌లలో హెల్తీ ఫుడ్..!!

- January 20, 2025 , by Maagulf
అబుదాబిలో జంక్ ఫుడ్‌ నిషేధం..స్కూల్స్, క్యాంటీన్‌లలో హెల్తీ ఫుడ్..!!

యూఏఈ: విద్యార్థులు, సిబ్బందికి ఆహార సేవలను అందించే పాఠశాలలు తప్పనిసరిగా ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అందించాలి. అబుదాబి విద్య, విజ్ఞాన శాఖ (అడెక్) ప్రకారం వారు తప్పనిసరిగా అవసరమైన లైసెన్స్‌లను పొందాలి.  విద్యా శాఖ 2024/25 విద్యా సంవత్సరంలో అమలు చేసిన కొత్త విధానం ప్రకారం.. పాఠశాలలు పౌష్టికాహార ఫుడ్ ను సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహార వాతావరణాన్ని కల్పించాలి.   ఆరోగ్యకరమైన ఆహార సంస్కృతిని ప్రోత్సాహించాలి. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉండేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కోరారు. "అనారోగ్యకరమైన" ఆహారాల గురించి పేరెంట్స్ కు అవగాహన కల్పించాలి.  అనారోగ్య ఆహార పదార్థాలు ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, టైప్ 2 మధుమేహం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

పాఠశాలలు క్యాంపస్‌లో ఆహార సేవలను అందించేటప్పుడు ప్రభుత్వ ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఉపాధ్యాయులు, క్యాంటీన్ సిబ్బంది తప్పనిసరిగా అబుదాబి పబ్లిక్ హెల్త్ సెంటర్ (ADPHC), ఇతర సంబంధిత సంస్థలచే నిర్వహించబడే శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి.    

1. అబుదాబి ఫుడ్ సేఫ్టీ నిబంధనల ద్వారా నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి, అలెర్జీలు ఉన్న విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి పాఠశాలలు తప్పనిసరిగా క్రింది దశలను తీసుకోవాలి.

విద్యార్థుల ఆహార అలెర్జీ సంబంధిత రికార్డులను నిర్వహించాలి. ఈ రికార్డులు పాఠశాల క్యాంటీన్‌లో అందుబాటులో ఉండాలి. పాఠశాల అందించే ఆహారంలో ఏదైనా అలెర్జీ కారకాలను ఆహార లేబుల్‌లు స్పష్టంగా పేర్కొనాలి.  అలెర్జీని తగ్గించే సంబంధిత మెడిసిన్ ను అందుబాటులో పెట్టుకోవాలి. ఈ ఆరోగ్యకరమైన, స్థిరమైన ఆహార పద్ధతులపై మంచి అవగాహనను ప్రోత్సహించడం ద్వారా స్కూల్ కమ్యూనిటీ పోషకాహార అవగాహన, ఆహారపు అలవాట్లను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుని, అదే సమయంలో గుడ్ ఆహార అలవాట్లకు మద్దతు ఇచ్చే పాఠశాల వాతావరణాలను సృష్టిస్తుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com