టెటానస్, డిఫ్తీరియా,కోరింత దగ్గు..వార్షిక వ్యాక్సినేషన్ క్యాంపెయిన్..!!

- January 20, 2025 , by Maagulf
టెటానస్, డిఫ్తీరియా,కోరింత దగ్గు..వార్షిక వ్యాక్సినేషన్ క్యాంపెయిన్..!!

దోహా, ఖతార్: టటానస్, డిఫ్తీరియా, కోరింత దగ్గు (Tdap) నుండి విద్యార్థులను రక్షించడానికి ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) తన వార్షిక వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని విద్య, ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ.. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ (PHCC) సహకారంతో అమలు చేస్తున్నారు. పాఠశాల ఆధారిత వ్యాక్సినేషన్ ప్రచారం అనేది ఈ వ్యాధుల నుండి వ్యక్తులను రక్షించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)చే అమలు చేస్తున్న కార్యక్రమం. రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి టీకా బూస్టర్ మోతాదును WHO సిఫార్సు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్, కమ్యూనిటీ పాఠశాలల్లో ప్రచార కార్యకలాపాలను ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని హెల్త్ ప్రొటెక్షన్ అండ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ హమద్ ఈద్ అల్ రొమైహి మాట్లాడుతూ.. ఈ వ్యాధుల నివారణకు, సురక్షితమైన ఆరోగ్యకరమైన విద్యా వాతావరణాన్ని అందించాలని కోరారు. ఖతార్ జాతీయ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం బూస్టర్ డోస్ సాధారణ టీకాలో అంతర్భాగమని డాక్టర్ అల్ రోమైహి వివరించారు.  తల్లితండ్రులు తమ పిల్లలను ఈ ఇప్పించాలని మంత్రిత్వ శాఖ కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com