పవన్ భద్రత పై విచారణ చేస్తున్నాము: ఏపీ డీజీపీ
- January 20, 2025
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ భద్రత అంశాన్ని సీరియస్గా విచారణ చేస్తున్నట్లు ఏపీ డీజీపీ తెలిపారు. పవన్ ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగిరిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్గా దర్యాప్తు చేస్తోందని.. నిన్న సాయంత్రానికి విచారణ పూర్తి కావాల్సి ఉందన్నారు. డ్రోన్ ఎగరడంపై పోలీసులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ భద్రతపై ప్రతీ అంశాన్ని సీరియస్గా తీసుకున్నామన్నారు. ఉపముఖ్యమంత్రి ఇంటిపై డ్రోన్ ఎగురవేయడంపై విచారణ చేస్తామని.. పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందా? లేదా? అన్నది నిర్ధారిస్తామని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ఏజెన్సీ పర్యటనలో భద్రతాపరంగా ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరనే విషయంపైనా విచారణ జరుగుతుందని డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.
డ్రోన్ ఎగరడంపై పోలీసులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారని తెలిపారు. అయితే ఈరోజు కూడా విచారణ కోసం కొంత సమయం కావాలని పోలీసులు అడిగారని.. నేటి సాయంత్రానికి డ్రోన్ కెమెరా ఎగిరిన అంశానికి సంబంధించి మొత్తం విచారణ పూర్తి అవుతుందని డీజీపీ తెలిపారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్.. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన సమయంలో ఒక నకిలీ పోలీసు ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రస్తావించగా.. ఈ రెండు అంశాలను వేరేవేరుగా చూస్తున్నామని తెలిపారు. మన్యం జిల్లాలో పవన్ పర్యటనలో ఎటువంటి భద్రతా లోపం లేదని, కేవలం పర్యటన పూర్తి అయిన తర్వాతే నకిలీ పోలీసు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని.. దానిపై కూడా విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







