యూఏఈ స్కూళ్లలో ముందస్తుగా టర్మ్-2 ఎగ్జామ్స్?

- January 21, 2025 , by Maagulf
యూఏఈ స్కూళ్లలో ముందస్తుగా టర్మ్-2 ఎగ్జామ్స్?

యూఏఈ: పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 27న ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, ఈ సంవత్సరం టర్మ్ 2లో కొన్ని యూఏఈ స్కూల్స్ అధికారిక పరీక్షలు నిర్వహించవు. రమదాన్ 2025 అంతర్జాతీయ పాఠ్యప్రణాళిక పాఠశాలల టర్మ్-ఎండ్ పరీక్షలు, భారతీయ పాఠ్యప్రణాళిక పాఠశాలల కోసం థార్డ్ టెర్మ్ పరీక్షలతో సమానంగా ఉంటుంది. ఇవి సాధారణంగా ఫిబ్రవరి, మార్చి మధ్య నిర్వహిస్తారు

దుబాయ్‌లోని GEMS కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్/CEO స్టీఫెన్ బ్రెకెన్ మాట్లాడుతూ.. “మా పాఠశాలలో 11 నుండి 13 సంవత్సరాల వరకు రమదాన్ కు ముందు మాక్ పరీక్షలు ఉంటాయి. 7 నుండి 10 క్లాస్ స్టూడెంట్స్ కు రమదాన్ కారణంగా టర్మ్ 2లో అధికారిక పరీక్షలు ఉండకూడదని మేము ముందుగానే నిర్ణయం తీసుకున్నాము. అయితే, మేము టర్మ్ 2లో అధికారిక పరీక్షలను నిర్వహించకూడదనే నిర్ణయానికి బదులుగా లెర్నింగ్ ప్రాజెక్ట్‌లు, ఇతర క్లాస్ వర్క్ సంబంధిత హోంవర్కులను ఇవ్వాలని నిర్ణయించాము. ఇది తల్లిదండ్రులకు ముందుగానే తెలియజేసాము. అన్ని టర్మ్ 3 పరీక్షలు అంతర్గతంగా సాధారణంగానే ఉంటాయి. ” అని వివరించారు.  విద్యార్థుల అకాడమిక్ కు అంతరాయం కలగకుండా చూసేందుకు సంస్థలు తమ పరీక్షల షెడ్యూల్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాయని ప్రిన్సిపాల్స్ స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com