160 దేశాల కార్మికుల కోసం 'ప్రొఫెషనల్ వెరిఫికేషన్' సర్వీస్..సౌదీ అరేబియా
- January 21, 2025
రియాద్ : మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తన 'ప్రొఫెషనల్ వెరిఫికేషన్' సర్వీస్ చివరి దశను విజయవంతంగా పూర్తి చేసింది. దీనిని 160 కార్మిక-ఎగుమతి దేశాలకు విస్తరించింది. ఇది 'ప్రొఫెషనల్ అక్రిడిటేషన్' కార్యక్రమం కింద విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో రాజ్యంలోకి ప్రవేశించే ప్రవాస కార్మికుల నైపుణ్య స్థాయిలను పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. ప్రవాస కార్మికులు రాజ్యానికి రాకముందే సౌదీ కార్మిక మార్కెట్‌కి అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలను కలిగి ఉండాలని కోరుతూ మంత్రుల మండలి నిర్ణయానికి అనుగుణంగా ఈ సేవను ప్రవేశపట్టిపెట్టినట్లు తెలిపారు. 'ప్రొఫెషనల్ అక్రిడిటేషన్' కోసం సౌదీ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అక్యుపేషన్స్, సౌదీ యూనిఫైడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ లెవెల్స్, స్పెషలైజేషన్ వంటి స్థాపించబడిన ప్రమాణాలను సాధించాల్సి ఉంటుంది. వృత్తిపరమైన ధృవీకరణ అమలు కోసం మంత్రిత్వ శాఖ 1,007 వృత్తులను కవర్ చేస్తుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!