దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ ప్రభుత్వం తొలి ఒప్పందం..
- January 21, 2025
దావోస్: దావోస్ పర్యటనలో తెలంగాణ సర్కార్ తొలి ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు యూనిలివర్ కంపెనీ ఓకే చెప్పింది. వినియోగ వస్తువుల తయారీలో బ్రాండ్ గా నిలిచిన యూనిలివర్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.
కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఓకే చెప్పింది. బాటిల్ క్యాప్స్ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయి.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విషయంలో యూనిలీవర్ సీఈవో హెయిన్ షూమేకర్ను సీఎం రేవంత్ కన్విన్స్ చేశారు. తెలంగాణలో రెండు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. భారతదేశంలో హిందుస్థాన్ లివర్గా పని చేస్తున్న గ్లోబల్ ఎఫ్ఎంసిజి మేజర్ అయిన యూనిలివర్ ఇప్పటివరకు తెలంగాణలో చెప్పుకోదగ్గ ఉనికిని కలిగి లేదు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అధికారులతో పాటు యూనిలివర్ సీఈవో హీన్ షూమేకర్, యూనిలివర్ చీఫ్ సప్లయ్ చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్లతో తెలంగాణలో యూనిలివర్ పెట్టుబడులు, వ్యాపార అవకాశాలపై చర్చించారు.
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా దావోస్ లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఇండియన్ పెవిలియన్ ను కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన సీఎం రేవంత్.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఆక్వా ప్రాసెసింగ్ తో పాటు స్కిల్ డెవలప్ మెంట్ రంగానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు.
తెలంగాణకు వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యం..
పలు కంపెనీల ఛైర్మన్లు, ఎండీలతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. గతంలో 40వేల కోట్ల పెట్టబడులు తీసుకొచ్చిన నేపథ్యంలో ఈసారి మరింత ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నారు. హైదరాబాద్ ని ఫ్యూచర్ సిటీగా ఫోకస్ చేయడంతో పాటు కొత్తగా తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సులో వివరించనున్నారు.
హైదరాబాద్ లో క్యాపిటల్ ల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడులు..
సింగపూర్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు క్యాపిటల్ ల్యాండ్ ఆసక్తి చూపింది. 450 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఐటీ పార్క్ ని క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రస్తుతం గ్లోబల్ రియల్ ఎస్టేట్ రంగంలో సింగపూర్ లో క్యాపిటల్ ల్యాండ్ సంస్థ లిస్టెడ్ కంపెనీగా ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







