RAKలో 27 మిలియన్ దిర్హామ్‌లకు పైగా ఫేక్ కరెన్సీ సీజ్..!!
- January 22, 2025
యూఏఈ: యూఏఈలో నకిలీ విదేశీ కరెన్సీని కలిగి ఉన్న ముగ్గురు అరబ్ జాతీయులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి $7.5 మిలియన్లు (Dh27.5 మిలియన్లు)ను స్వాధీనం చేసుకున్నారు. రస్ అల్ ఖైమాలోని ఒక వ్యాపారవేత్త ఇద్దరు సహచరుల సహాయంతో నకిలీ కరెన్సీని చెలామణి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ జనరల్ కమాండ్, జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ సెక్యూరిటీ, ఇంటీరియర్ మినిస్ట్రీలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి నకిలీ కరెన్సీ నమూనాలతోపాటు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







