యూఏఈ పెవిలియన్‌ను సందర్శించిన హిస్ హైనెస్ ఇసా బిన్ సల్మాన్..!!

- January 22, 2025 , by Maagulf
యూఏఈ పెవిలియన్‌ను సందర్శించిన హిస్ హైనెస్ ఇసా బిన్ సల్మాన్..!!

మనామా: ఇసా బిన్ సల్మాన్ ఎడ్యుకేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీల బోర్డు ఛైర్మన్, లేబర్ ఫండ్ (తమ్‌కీన్) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ హిస్ హైనెస్ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా..  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని సందర్శించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) 55వ వార్షిక సమావేశంలో యూఏఈ పెవిలియన్ ను యూఏఈ క్యాబినెట్ వ్యవహారాల మంత్రి, HE మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ గెర్గావి, యూఏఈ ప్రతినిధి బృందం సభ్యులతో కలిసి సందర్శించారు.  అనంతరం వారితో సమావేశం అయ్యారు. WEFలో ఉన్నత స్థాయి బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి హెచ్‌హెచ్ షేక్ ఇసా బిన్ సల్మాన్ నాయకత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హిస్ హైనెస్ షేక్ ఇసా బిన్ సల్మాన్.. బహ్రెయిన్ -యూఏఈ మధ్య ఉన్న బలమైన సంబంధాలను సమీక్షించారు.  రాబోయే రోజుల్లో వివిధ రంగాల్లో సంబంధాలను పెంపొందించే మార్గాలను కూడా సమావేశంలో చర్చించారు. బహ్రెయిన్ ఆర్థిక మంత్రి, HE షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, పలువురు సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com