రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్..
- January 23, 2025
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడిగా పేరుపొందిన రాంగోపాల్ వర్మ కు బిగ్ షాక్ తగిలింది. ఓ కేసుకు సంబంధించి మూడు నెలలు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కు సంబంధించి ఆరేళ్ల కిందటి కేసులో విచారణ సందర్భంగా ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ.3,72,219 పరిహారం చెల్లించాలని వర్మను కోర్టు ఆదేశించింది. పరిహారం చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
2018లో రామ్ గోపాల్ వర్మపై ఈ చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మహేశ్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రాంగోపాల్ వర్మ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ కేసులో అప్పటి నుంచి వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేదు. ఈ క్రమంలో తాజాగా కోర్టు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'