HMC రికార్డు..మూడు మిలియన్లకు పైగా ఔట్ పేషెంట్ సేవలు..!!
- January 23, 2025
దోహా, ఖతార్: హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ 2024లో మూడు మిలియన్లకు పైగా విజిట్స్ ను నమోదు చేసింది. 24 మిలియన్లకు పైగా పరీక్షలను నిర్వహించింది. గణాంకాల ప్రకారం, 2024లో వాటిని అత్యధికంగా సేవలను అందించింది. ఖతార్‌లో HMC ప్రధాన పబ్లిక్ హెల్త్‌కేర్ ప్రొవైడర్.. ఇది 12 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఇందులో తొమ్మిది స్పెషలిస్ట్ ఆసుపత్రులు, మూడు కమ్యూనిటీ ఆసుపత్రులతోపాటు అంబులెన్స్ సర్వీస్, పీడియాట్రిక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అందిస్తుంది.
ఔట్ పేషెంట్ విభాగం 2024లో 3,198,989 సందర్శనలను నమోదు చేసింది.జూలై, డిసెంబర్ 2024 మధ్య 1,770,362 విజిట్స్ ఉన్నాయి. జనవరి, జూన్ మధ్య నమోదైన 1,428,627 సందర్శనలతో పోలిస్తే 24% పెరిగాయి. లాబొరేటరీ మెడిసిన్, పాథాలజీ విభాగం (DLMP) 24,372,843 పరీక్షలను నిర్వహించింది. HMCలోని సెంటర్ ఫర్ పేషెంట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ స్టాఫ్ ఎంగేజ్‌మెంట్ (CPESE) అపాయింట్‌మెంట్ బుకింగ్‌ను ఆప్టిమైజ్ చేయడం, వెయిటింగ్ టైమ్‌లను తగ్గించడం, సులువుగా ఔట్ పేషెంట్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రెఫరల్ , బుకింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (RBMS)ని మెరుగుపరచడానికి కృషి చేస్తోంది.
2024లో HMC ఆసుపత్రులలోని అత్యవసర విభాగాలు 672,701 మంది రోగులను పొందాయి. HMC ఐదు పీడియాట్రిక్ ఎమర్జెన్సీ సెంటర్‌లు 781,595 మంది పిల్లలకు చికిత్స చేశాయి. HMC నెట్‌వర్క్‌లోని అన్ని ఆసుపత్రులు 405,571 మంది ఇన్‌పేషెంట్లకు చికిత్స అందించాయి. 2024 ఫిబ్రవరి, డిసెంబర్ మధ్య హెచ్‌ఎంసి ఆసుపత్రుల్లో మొత్తం 25,467 మంది శిశువులు జన్మించారు. అర్జెంట్ కన్సల్టేషన్ సర్వీస్, 2024లో 147,896 కాల్స్, మానసిక ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందించే నేషనల్ మెంటల్ హెల్త్ హెల్ప్‌లైన్‌కి 15,501 కాల్‌లు వచ్చాయని డేటా తెలిపింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్‌స్టాప్‌లలో రియల్‌టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్‌లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







