జబల్ షామ్స్, అల్ జబల్ అల్ అఖ్దర్లో కొత్త పర్యాటక ప్రాజెక్టులు..!!
- January 23, 2025
మస్కట్: 2024లో రవాణా రంగంలో ప్రారంభించిన ప్రాజెక్టులలో 90% పూర్తి అయినట్టు రవాణా, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఖమీస్ మొహమ్మద్ అల్ షమ్మఖీ పేర్కొన్నారు. ఓడరేవుల రంగం విషయానికొస్తే, ఈ రంగం నుండి ప్రయోజనాలను పెంచుకోవడానికి, మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని అల్ షమ్మఖి తెలిపారు. జబల్ షామ్స్, అల్ జబల్ అల్ అఖ్దర్, అల్ జబల్ అల్ అబ్యాద్లలో అనేక పర్యాటక సంబంధిత ప్రాజెక్టుల అమలుపై మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తుందని తెలిపారు.
ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్ సెక్రటరీ అలీ అమెర్ అల్ షిధానీ మాట్లాడుతూ..ఎలక్ట్రానిక్ అథెంటికేషన్ సిస్టమ్‌ను అప్డేట్ చేయడం, అప్‌గ్రేడ్ చేయడంలో మంత్రిత్వ శాఖ పనిచేసిందని చెప్పారు. ప్రభుత్వ సేవల్లో ఏకీకరణ సాధించేందుకు డిజిటల్ పరివర్తన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన ధృవీకరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సహకారంతో ఒమన్‌లో 4ఐఆర్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం అంతర్జాతీయ నైపుణ్యం నుండి ప్రయోజనం పొందడం, అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవడం లక్ష్యంగా ఉందని అల్ షిధానీ చెప్పారు. అంతర్జాతీయ ఫోరమ్‌లలో ఒమన్ తన ఉనికిని పెంపొందించడానికి ఈ కేంద్రం దోహదం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







