హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీస్
- January 23, 2025
హైదరాబాద్: మార్చి 18 నుంచి హైదరాబాద్, వియత్నాం మధ్య విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. వియట్‌జెట్ సంస్థ నడిపే ఈ విమాన సర్వీసులు వారంలో రెండు రోజులు(మంగళ, శనివారం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. హోచిమన్ సిటీ(వియత్నాం) నుంచి రాత్రి 7.40కు బయల్దేరే ఫ్లైట్ రాత్రి 10.35కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. రాత్రి 11.35కు శంషాబాద్‌లో బయల్దేరి, తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు వియత్నాం చేరుతుంది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు మధ్య ప్రారంభంకానున్న ఈ నూతన సర్వీసు సందర్భంగా ప్రారంభ విమాన టికెట్ ధర పన్నులు కలుపుకొని రూ.11గా నిర్ణయించింది. ఈ నెల 30 వరకు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఫిబ్రవరి 10 నుంచి సెప్టెంబర్ 30 లోగా ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతోపాటు బిజినెస్, స్కైబాస్ టికెట్ పై 20 శాతం తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది. ఈ సర్వీసు కేవలం మంగళ, శనివారాలు మాత్రమే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







