క్యాండీలు, కేక్‌లలో ఉపయోగించే ఎరుపు రంగు పై నిషేధం..!!
- January 24, 2025
యూఏఈ: కొన్ని మిఠాయిలు, స్నాక్స్, పండ్ల ఉత్పత్తులు, కేకులు, కొన్ని నోటి మందులకు చెర్రీ-ఎరుపు రంగును ఇచ్చే సింథటిక్ ఫుడ్ డై వాడకాన్ని అమెరికా బుధవారం నిషేధించిన తర్వాత, దీనిపై యూఏఈ అప్రమత్తమైంది. తాము కూడా సింథటిక్ ఫుడ్ డై వాడకాన్ని పర్యవెక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ రంగు ప్రయోగశాల ఎలుకలలో క్యాన్సర్‌కు కారణమవుతుందని రుజువు కావడంతో అమెరికా దాని వినియోగంపై నిషేధం విధించింది.
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆహార పదార్థాలలో రెడ్ నెం.3 రంగుపై నిషేధం విధించిన మూడు దశాబ్దాల తర్వాత అది సౌందర్య సాధనాల్లో ఉపయోగించదాన్ని నిషేధించారు. ఈ రంగు ప్రస్తుతం అమెరికాలో దాదాపు 3,000 ఆహార ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు.
ఇక ఎమిరేట్స్ లో, దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తులు స్థానిక అధికారులతో సమన్వయంతో ఎంట్రీ పాయింట్ల వద్ద కఠినమైన తనిఖీలకు లోబడి ఉంటాయి. ఆహార ఉత్పత్తులు వినియోగానికి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి క్రమం తప్పకుండా నమూనాలను పరీక్షించబడతాయి. అవి వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించకుండా చూసేందుకు అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రమాణాల మేరకు నిబంధనలను నిర్దేశిస్తారు.
తాజా వార్తలు
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!







