హైదరాబాద్: యువ గాయకులతో హుషారు పాటలు
- January 24, 2025
హైదరాబాద్: హైదరాబాద్‌లో శ్రీ రాగ భైరవి సంస్థ నిర్వహణలో శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై యువ గాయనీ గాయకులు నేటి సినిమా పాటలను పాడి శ్రోతలకు హుషారు కలిగించారు.విఖ్యాత గాయకుడు డాక్టర్ ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం సహా గాయణులతో కలసి పాడిన పాటలను యువ గాయకులు ఉత్సాహంగా పాడి చలి వాతావరణంలో వేడి పుట్టించారు.కామేష్ మాంధా,చంద్ర మౌళి,మనోజ్ భరత్ రాము దిలావర్ ఇందు నయన అనుపమ ఆనంది చంద్రిక స్వప్న తదితరులు పాటల విందు చేశారు.అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు పాల్గొని మాట్లాడుతూ...బాలసుబ్రహ్మణ్యం తో తమ సంస్థకు వున్న అనుబంధం గుర్తు చేసుకున్నారు గాన సభ కు బాలు ఎన్నోసార్లు వచ్చారని గుర్తు చేసుకున్నారు.ఘంటసాల తరువాత అంతటి కీర్తి సంపాదించుకున్న నేపథ్య గాయకుడు బాలు అన్నారు శ్రీ రాగభైరవి సంస్థలో పాడిన యువ గాయని గాయకులకు మంచి భవిష్యత్ వుంటుందని కామేష్ నిర్వహణలో అరుదుగా కనిపించే గాయనీ గాయకులు పాలు పంచుకొవటం విశేషం అన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







