జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ వద్ద భారీగా క్యాప్టాగన్ పిల్స్ స్వాధీనం..!!
- January 25, 2025
జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ ద్వారా సౌదీ అరేబియాలో 1,482,132 క్యాప్‌గాన్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని జకాత్, పన్ను కస్టమ్స్ అథారిటీ (ZATCA) అడ్డుకుంది. లాండ్రీలో ఉపయోగించే పరికరాలలో మాత్రలను దాగి తరలిస్తున్నారని ZATCA వెల్లడించింది. అధునాతన కస్టమ్స్ తనిఖీ పద్ధతుల కారణంగా వాటిని గుర్తించినట్లు తెలిపారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్‌తో సమన్వయంతో ఈ ఆపరేషన్ విజయవంతం అయిందన్నారు.ఈ కేసుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకొని ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాల వివరాలను తెలిపి స్మగ్లింగ్‌పై పోరాటానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ప్రజలను సహకరించాలని ZATCA ప్రజలను కోరింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా పెడతామని, కచ్చితమైన సమాచారం అందించినవారికి నగదు రివార్డులు అందిజేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







