సిరియాపై ఆంక్షలను ఎత్తివేతకు కృషి: సౌదీ అరేబియా
- January 25, 2025
డమాస్కస్: సిరియా పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ పునరుద్ఘాటించారు. అదేసమయంలో సిరియాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడానికి చర్యలను వేగవంతం చేసినట్టు తెలిపారు. ఆంక్షలను ఎత్తివేయడం గురించి సౌదీ అరేబియా సంబంధిత దేశాలతో చురుకుగా చర్చలు జరుపుతోందని ప్రిన్స్ ఫైసల్ పేర్కొన్నారు. ఈ విషయంలో సానుకూల సంకేతాలు అందుతున్నాయని కూడా ఆయన వెల్లడించారు. దేశ సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇవ్వడం ప్రాముఖ్యతను చెబుతూ.. సిరియన్లు ఐక్యంగా ఉన్నంత కాలం సిరియా తన ప్రముఖ స్థానాన్ని తిరిగి పొందగలదని ప్రిన్స్ ఫైసల్ పేర్కొన్నారు. ప్రస్తుతం క్లిష్టమైన దశలో ఉన్న సిరియన్ ప్రజల సామర్థ్యంపై ప్రిన్స్ ఫైసల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







