మోటార్‌ సైకిలిస్టులపై 13,700 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!

- January 25, 2025 , by Maagulf
మోటార్‌ సైకిలిస్టులపై 13,700 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!

మనామా: గత నాలుగేళ్లలో మోటార్‌సైకిలిస్టులపై 13,725 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయని, అదే సమయంలో తీవ్రమైన ఉల్లంఘనల కారణంగా 346 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలను, ప్రత్యేకించి ఆహారం, ఇతర ఆర్డర్‌ల వంటి డెలివరీ సేవలకు ఉపయోగించే మోటార్‌సైకిళ్లను ఖచ్చితంగా పర్యవేక్షణ ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కౌన్సిల్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు సమర్పించిన నివేదికలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ నమోదు చేసిన ఉల్లంఘనలపై మంత్రిత్వ శాఖ గణాంకాలను అందించింది. 2020లో 2,378 ఉల్లంఘనలు , 2021లో 3,227, 2022లో 3,932.. నవంబర్ 21, 2023 నాటికి నమోదైన ఉల్లంఘనల సంఖ్య 4,188కి పెరిగిందని తెలిపింది.  ఉల్లంఘనలను పరిష్కరించడానికి ట్రాఫిక్ చట్టం ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ చర్యలు అమలు చేసినేట్టు అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.  "రైడ్ సేఫ్" ప్రచారంలో భాగంగా ట్రాఫిక్ చట్టాలను పాటించడాన్ని ప్రోత్సహించడానికి, ప్రమాదాలను తగ్గించడానికి రూపొందించినట్టు తెలిపారు. డెలివరీ కంపెనీల సహకారంతో మంత్రిత్వ శాఖ 2023లో 30కి పైగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com