కిడ్నీకేసు–పరారీలో ఎనిమిది మంది నిందితులు: సీపీ సుధీర్ బాబు
- January 25, 2025
హైదరాబాద్: కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారని, వారిలో ఇప్పటికే ఏడుగుర్ని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపి సుధీర్ బాబు తెలిపారు. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.రాచకొండ కార్యాలయంలో నేడు మీడియాతో ఆయన మాట్లాడుతూ, “అరెస్ట్ అయినవారిలో జనరల్ సర్జన్ డాక్టర్ సిద్ధంశెట్టి అవినాష్, అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమంత్ కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్‌లతో పాటు ఆస్పత్రి సిబ్బంది గోపి, రవి, రవీందర్, హరీష్, సాయిలును అరెస్ట్ చేశాం. కిడ్నీ మార్పిడి చేసే ప్రధాన సర్జన్ తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ పరారీలో ఉన్నాడు. జమ్మూకాశ్మీర్‌కు చెందిన మరో సర్జన్ డాక్టర్ సోహెబ్ కూడా పరారీలో ఉన్నాడు. ఆర్గనైజర్లు పవన్, పూర్ణ, లక్ష్మణ్‌ల జాడ కోసం వెతుకుతున్నాం.మీడి యేటర్లు సూరజ్ మిశ్రా, శంకర్లు కూడా తప్పించుకు తిరుగుతున్నారు.” అని పేర్కొన్నారు.
“చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అవినాష్.. ఇండియాకి తిరిగి వచ్చి పూణేలో డిప్లమా ఇన్ సర్జరీ పూర్తి చేశాడు. 2022లో హైదరాబాదులోని మాదన్నపేట లో ఉన్న జనని హాస్పిటల్ ను డాక్టర్ అవినాష్ అతని స్నేహితులు లీజుకు తీసుకున్నారు.అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు అవినాష్.ఈ క్రమంలో అతనికి వైజాగ్ కు చెందిన లక్ష్మణ్ పరిచయమయ్యాడు. ఇల్లీగల్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌లు చేయాలంటూ లక్ష్మణ్, డాక్టర్ అవినాష్‌కు సూచించాడు. ప్రతి కిడ్నీ మార్పిడి సర్జరీకి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







