సముద్ర మధ్యలో భారత జాతీయ జెండా
- January 26, 2025
విశాఖపట్నం: గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖలో మరొక సరికొత్త దేశభక్తి ప్రదర్శన జరిగింది. దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి సముద్రాన్ని కాపాడే పిలుపు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నది.స్వతంత్రత దినోత్సవం సందర్భంగా సముద్రంలో జరిగిన ఈ ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.స్కూబా డైవర్ బలరాం నాయుడు, తన స్నేహితులతో కలిసి, 76వ గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ జెండాతో గుర్తుచేశారు. 78 అడుగుల లోతులో సుమారు అరగంట పాటు జాతీయ జెండాను ప్రదర్శించి, దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు.ఈ ప్రదర్శనకు ఆనంద్, సతీష్, నరేష్, రాజు సహా నలుగురు సభ్యులు పాల్గొన్నారు.ఈ ప్రదర్శనలో మువ్వనల జెండాతో నీటిలో రెపరెపలాడుతూ దేశభక్తిని ప్రదర్శించడం విశేషం. బలరాం నాయుడు నేతృత్వంలోని బృందం ఋషికొండ బీచ్ వద్ద సముద్రంలో డైవ్ చేసి, సాహసంతో కూడిన ప్రదర్శన చేశారు
సముద్ర మధ్యలో జాతీయ జెండా
జాతీయ జెండా 45 నిమిషాల పాటు నీటిలో రెపరెపలాడుతూ, దేశం కోసం త్యాగాలు చేసిన వారి ఆత్మగౌరవాన్ని చూపించారు.అంతేకాకుండా, ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రత్యేక ప్రస్తావన ఇచ్చారు. సముద్రంలో మున్నెళ్ల జెండా ప్రదర్శిస్తూ, ప్లాస్టిక్ వ్యర్ధాలను సముద్రం నుంచి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సమాజానికి మేలు చేకూర్చే విధంగా నిర్వహించబడింది.ఇదే కాకుండా, స్కూబా డైవింగ్ ద్వారా అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహిస్తూ ఈ జట్టు యువతకు ఒక సందేశం ఇచ్చింది. దీని ద్వారా సముద్ర జీవరాశులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తితో కూడిన ఈ విభిన్న ప్రదర్శన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చేరవేసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







