ఐఎస్ఐఎస్ సానుభూతుల కోసం మాదాపూర్ లో పోలీసుల వేట
- June 30, 2016
ఐఎస్ఐఎస్ సానుభూతిపరులు హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు కుట్ర పన్నారన్న వార్తల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాతబస్తీ ప్రాంతంలో ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకున్న ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, రసాయనాల, నగదుతో పాటు గచ్చిబౌలికి చెందిన రెండు మ్యాప్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇనార్బిట్ మాల్తో పాటు జనసమ్మర్థ ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు బహిర్గతం కావడంతో పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఇనార్బిట్ మాల్తో పాటు లాడ్జీలు, ఫంక్షన్ హాళ్లు, పర్యాటక ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మాదాపూర్ డీసీపీ కార్తికేయ నేతృత్వంలో పోలీసులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







