సౌత్ అల్ బతినాలో అగ్నిప్రమాదం..ముగ్గురికి గాయాలు..!!

- January 27, 2025 , by Maagulf
సౌత్ అల్ బతినాలో అగ్నిప్రమాదం..ముగ్గురికి గాయాలు..!!

మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లోని బార్కాలోని విలాయత్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్‌మెంట్ (సిడిఎఎ)కి చెందిన అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలు కాగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విజయవంతంగా మంటలను ఆర్పివేసినట్లు CDAA వెల్లడించింది. జనవరి 26న జరిగిన మరో సంఘటనలో..మస్కట్ గవర్నరేట్‌లోని అగ్నిమాపక బృందాలు ముత్రా విలాయత్‌లోని ఒక భవనంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై స్పందించాయి. అక్కడ ఎవరికి ఎటువంటి గాయాలు నమోదు చేయకుండా మంటలను ఆర్పివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com