భారత సాంస్కృతిక వైవిధ్యంపై కువైట్ రాయబారి ప్రశంసలు..!!
- January 28, 2025
కువైట్: ఇండియా సాంస్కృతిక, మత, జాతి వైవిధ్యం, సహకార స్ఫూర్తిని భారత్ లోని కువైట్ రాయబారి మెషల్ అల్షెమాలి ప్రశంసలు కురిపించారు. గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానం మేరకు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్, సైనిక కవాతుకు ఆయన హాజరయ్యారు. భారతదేశ సైనిక పురోగతి, సాంస్కృతిక వైవిధ్యం, సాంకేతిక ఆవిష్కరణలను పరేడ్ సందర్భంగా ప్రదర్శించారని రాయబారి పేర్కొన్నారు. కువైట్-భారత సంబంధాలను మరింత పటిష్టం చేయాలనే కువైట్ నాయకత్వం ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. గత డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటన రెండు స్నేహపూర్వక దేశాల మధ్య రాజకీయ, వాణిజ్య, ఆర్థిక, రక్షణ, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో కొత్త పునాదులు వేసిందని, సంబంధాలను మరింత సమగ్రంగా, వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లిందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







