నకిలీ బిల్లులతో అమెజాన్ కు 100 కోట్ల మోసం
- January 28, 2025
అమెరికా: ఇందులో అని కాదు అందులో అని కాదు అన్ని రంగాల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా అమెజాన్ లో కూడా భారీ మోసం బయటపడింది. ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ ను ఆ సంస్థ ఉద్యోగులే మోసం చేశారు. వినియోగదారులకు సరుకులను అందించే క్రమంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.102 కోట్లను కాజేశారు. ప్యాకేజీపై పేర్కొన్న చిరునామాలో వినియోగదారుడు లేడని చెబుతూ రవాణా చార్జీలు క్లెయిమ్ చేసుకున్నారు. హైదరాబాద్ ఆఫీసు కేంద్రంగా జరిగిన ఈ మోసంలో సంస్థ సిబ్బందితో పాటు గతంలో పనిచేసి మానేసిన వారి ప్రమేయం కూడా ఉందని అమెజాన్ ప్రతినిధి జీఎస్ అర్జున్ కుమార్ ఆరోపించారు. ఈమేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయగా.. అధికారులు మొత్తం 22 మందిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
వస్తువును డెలివరీ చేయడానికి వెళ్లిన సమయంలో ఆ చిరునామాలో కస్టమర్ లేకపోతే ఆ విషయాన్ని అమెజాన్ సిబ్బంది సంస్థ యాప్ లో నమోదు చేయాలి. దీనిని రిలే సెంటర్ సిబ్బంది నిర్ధారిస్తారు. డెలివరీ కోసం ఎంత దూరం ప్రయాణించారనేది లెక్కగట్టి, దీనికి అయిన ఖర్చును డెలివరీ సంస్థలకు అమెజాన్ చెల్లిస్తుంది. అమెరికాలో వస్తువుల డెలివరీకి వెళ్లకుండానే వెళ్లినట్లు రికార్డు చేసి, చిరునామాలో కస్టమర్ లేడని చెబుతూ రవాణా ఖర్చులను వసూలు చేశారు. ఇలా రూ.102,88,05,418 కొల్లగొట్టారు.
నకిలీ ట్రిప్పుల నమోదు
హైదరాబాద్ లో అమెజాన్ రిలే ఆపరేషన్ సెంటర్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువును డెలివరీ చేస్తున్నదీ ఈ సెంటర్ నుంచే పర్యవేక్షిస్తారు. గోడౌన్ నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ప్యాకేజీ కస్టమర్ కు చేరేవరకు సంస్థ సిబ్బంది కదలికలను జీపీఎస్ ఆధారంగా పర్యవేక్షిస్తుంటారు. ఇందులో లొసుగును పసిగట్టిన మాజీ సిబ్బంది కొంతమంది మోసానికి తెరలేపారు. ప్రస్తుతం రిలే సెంటర్ లో పనిచేస్తున్న వారితో పాటు అమెరికాలోని సిబ్బందితో కలిసి నకిలీ ట్రిప్పులను నమోదు చేసి బిల్లులు దండుకున్నారు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







