మహాకుంభమేళాలో తొక్కిసలాట...17 మంది మృతి
- January 29, 2025
ప్రయాగ్‌రాజ్: ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో నేడు అపశ్రుతి జరిగింది.మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
దీంతో సెక్టార్-2లోని భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగి భారీ తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో సుమారు 17 మంది మృతి చెందినట్లు సమాచారం..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తుంది.ఈ ఘటనలో 50 మందికిపైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన జరిగిన వెంటనే స్పందించిన సిబ్బంది.. గాయపడిన వారిని చికిత్స కోసం అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు.
కాగా, మౌని అమావాస్యను పురస్కరించుకుని మూడో అమృత స్నానం కోసం పెద్ద సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు తరలిరావడంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది.
తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మోదీ ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







