ఇస్రో 100వ రాకెట్ ప్రయోగం సక్సెస్
- January 29, 2025
శ్రీహరికోట: ఇస్రో తన 100వ ప్రయోగంలో భాగంగా నింగిలోకి రాకెట్ పంపించింది. నేటి ఉదయం 6.23 గంటలకు శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ – ఎఫ్15 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.ఇస్రో శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఈ వందో మిషన్‌లో ఎస్‌వీఎన్ 02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది.
.దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(నావిక్)లో ఇది భాగం. నావిక్ అనేది పూర్తిగా స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ.ఇది భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు.. ఇతర సైనిక అవసరాలకు ఉపయోగపడుతుంది.’
నావిక్’తో భారత్‌లో, భారత సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల దూరం వరకు కచ్చితమైన నేవిగేషన్ సమాచారం తెలుసుకోవచ్చు.’నావిక్’ కోసం ఇప్పటికే వివిధ ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో తాజా ప్రయోగంలో ఒక ఆటమిక్ క్లాక్‌ను నింగిలోకి పంపింది.ఇలాంటి గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ పనిచేయడంలో అటామిక్ క్లాక్ చాలా కీలకమని, అందులోనే భారత్ మరింత స్వయం సమృద్ధి సాధించిందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తెలిపారు.
జీపీఎస్, గ్లోనాస్ వంటి విదేశీ టెక్నాలజీ మీదనే ఆధారపడుతున్న భారత్, ఇకపై మరింతగానావిక్ మీద ఆధారపడుతుందని రఘునందన్ తెలిపారు.
శ్రీహరికోట నుంచే ఎందుకు?
రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోటను ఎంపిక చేయడానికి ప్రధానంగా 4 కారణాలు చెప్పుకోవచ్చు.
1) అందులో ఒకటి భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండటం.ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగిస్తే పైసా ఖర్చు లేకుండా దానికి సెకన్‌కు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. భూభ్రమణం వల్ల రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది.భారత్‌లో శ్రీహరికోట, ఫ్రెంచ్‌గయానాలో కౌరూ, అమెరికాలో ఫ్లోరిడా కెన్నడీ స్పేస్ సెంటర్‌లు భూమధ్య రేఖకు సమీపంగా ఉన్నాయి.ఈ కారణంగానే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా..కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచే యూరప్ దేశాలు రాకెట్లను ప్రయోగిస్తున్నాయి.
2) రాకెట్ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత నేరుగా నింగిలోకే వెళ్తుందన్న గ్యారెంటీ అన్నిసార్లూ ఉండకపోవచ్చు.సాంకేతిక కారణాలతో అప్పడప్పుడు రాకెట్‌లు గాడి తప్పి కూలిపోతూ ఉంటాయి.అలాంటప్పుడు ఆ రాకెట్ శకలాలు జనావాసాల మీద పడితే ప్రాణనష్టం జరుగుతుంది.
కానీ, శ్రీహరికోటకు చుట్టూ సముద్రమే ఉంది. అందువల్ల అనుకోని కారణాలతో ప్రయోగం విఫలమై రాకెట్ కూలినా సముద్రంలో పడేందుకే ఎక్కువ అవకాశం ఉంటుంది.
3) రాకెట్ ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉండకూడదు. ఎండలు మండకూడదు. శ్రీహరికోటలో ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది.వర్షాలు, ఎండలు అతిగా ఉండవు. ఒక్క అక్టోబర్, నవంబర్‌లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10నెలలు ప్రయోగాలకు అనుకూల సమయమే.
4) రాకెట్ ప్రయోగం సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి అత్యంత ధృడంగా ఉండాలి.శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత ధృడంగా ఉంటుంది.రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు శ్రీహరికోట ఒక ఆప్షన్ కాదు. భారత్‌కు ఉన్న అరుదైన అవకాశం. శ్రీహరికోటను మించిన ప్రదేశం మరొకటి భారతదేశంలో లేదు. అందుకే ఇది’రాకెట్ ప్రయోగాల కోట’ అయింది.
నిజానికి అంతరిక్ష పరిశోధనా ప్రయోగ కేంద్రాన్ని మొదట కేరళలోని తుంబలో ఏర్పాటు చేశారు.తొలుత రాకెట్ల ప్రయోగ కేంద్రంగా ఉన్న తుంబ, తర్వాత పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా మారింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







