షార్జాలో అమల్లోకి స్మార్ట్ పెయిడ్ పార్కింగ్ సర్వీస్..!!
- February 02, 2025
యూఏఈ: స్మార్ట్ పెయిడ్ పార్కింగ్ సేవలు ఇప్పుడు షార్జా నగరంలో అమల్లోకి వచ్చాయని ఎమిరేట్ మునిసిపాలిటీ ప్రకటించింది. అల్ ఖాన్, అల్ నాద్‌లలో ప్రారంభించిన 2 స్మార్ట్ పార్కింగ్ ప్రాంతాలలో మొత్తం 392 పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.
స్మార్ట్ పార్కింగ్ ఎలా పనిచేస్తుందంటే?
ముందుగా నిర్దేశించిన ఎంట్రీ ద్వారా వాహనాలు ప్రవేశించినప్పుడు, డ్రైవర్ల నంబర్ ప్లేట్లు ఆటోమెటిక్ గా గుర్తించబడతాయి. మళ్లీ ఎగ్జిట్ అయ్యే సమయంలో స్మార్ట్ కెమెరాలు మళ్లీ ప్లేట్‌ను ఆటోగా రీడ్ చేస్తాయి. పార్కింగ్ వ్యవధి ని బట్టి సిస్టమ్ ద్వారా లెక్కించి, వాహన యజమానికి నోటిఫికేషన్ పంపుతుంది. వాహనదారులు Mawqef అప్లికేషన్ ద్వారా పార్కింగ్ ఫీను చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







