దుబాయ్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్..600% ఎక్కువకు టిక్కెట్లు రీసేల్..!!
- February 05, 2025
దుబాయ్: ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ పోరు టిక్కెట్లు వాటి అసలు ధర కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. నిజానికి ధర 500, సాధారణ అడ్మిషన్ టిక్కెట్లు ఇప్పుడు Facebook మార్కెట్‌ప్లేస్, ఇతర క్లాసిఫైడ్ సైట్లలో Dh3,500 వరకు ఉన్నాయి. చాలా మంది క్రికెట్ ఔత్సాహికులు సోమవారం ఆన్లైన్ క్యూలో గంటల తరబడి టిక్కెట్లు కొనాలని ఆశతో ప్రయత్నించినా, అవి ఇప్పటికే గంటలోపే అమ్ముడయ్యాయని తెలుసుకుని నిరాశ చెందారు. “మ్యాచ్ టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. నా వంతు వచ్చే సరికి టిక్కెట్లు అయిపోయాయి. కానీ, ప్రస్తుతం రీసేల్ కింద Dh3,500 లేదా అంతకంటే ఎక్కువ అడుగుతున్నారు. ”అని షార్జాలో నివాసం ఉంటున్న క్రికెట్ అభిమాని అబ్దుల్ కరీం తెలిపారు.
“నేను టికెట్ కొనడానికి Dh500 కేటాయించాను,.కానీ మ్యాచ్ కోసం Dh1,000 కంటే ఎక్కువ భరించగలిగే అవకాశం లేదు. ఈ మ్యాచ్‌లు విపరీతమైన ధరలను చెల్లించగల వ్యక్తుల కోసం మాత్రమే అనిపిస్తుంది, ”అని హరీష్ దాస్ అనే క్రికెట్ అభిమాని తెలిపారు. భారతదేశంలోని ధరలతో పోలిస్తే దుబాయ్‌లో టిక్కెట్ ధర కూడా చాలా ఎక్కువని, మ్యాచ్‌ను స్క్రీన్‌పై చూడడమే చివరి అవకాశమని తెలిపారు.
క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లు అత్యంత డిమాండ్‌లో ఉన్నందున, టిక్కెట్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. యూఏఈ మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్థాన్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, సెమీఫైనల్ వంటి గేమ్‌లకు ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్న కొనుగోలుదారుల నుండి బలమైన డిమాండ్ ఉంది. ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుండగా, అధికారిక విక్రయ సమయంలో టిక్కెట్లను పొందలేకపోయిన చాలా మంది అభిమానుల ఉత్సాహానికి ఆకాశాన్నంటుతున్న రీసేల్ ధరలు చూసి షాక్ అవుతున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







