బాహుబలి (బిగినింగ్): రివ్యూ
- July 10, 2015
తారాగణం: ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, ప్రభాకర్, అడవి శేష్, సుదీప్, రోహిణి తదితరులు.
చాయాగ్రహణం: సెంథిల్‌కుమార్
సంగీతం: ఎంఎం కీరవాణి
నిర్మాణం: ఆర్కా మీడియా వర్క్స్
దర్శకత్వం: ఎస్ ఎస్ రాజమౌళి
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
సమర్పణ: కె రాఘవేంద్రరావు
విడుదల తేదీ: 10 జులై 2015
కథ
శతృవుల బారి నుంచి ఒక మగబిడ్డను రక్షిస్తుంది శివగామి(రమ్యకృష్ణ). ఆ బిడ్ద ఒక నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూండగా ఒకచోట ఆటవిక తెగకు చెందిన ఓ మహిళ(రోహిణి)కి దొరుకుతాడు. ఆమె ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచుకుంటుంది. ఆ పిల్లవానికి శివుడు అని పేరు పెడుతుంది. శివుడు(ప్రభాస్) చిన్నప్పట్నుంచీ ఆ అడవికి అవతలి వైపున్న కొండలపై ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు .చివరికి పెద్దయ్యాక ఒకరోజు ఆ కొండలపైకి చేరుకుంటాడు. అక్కడ అందాల రాజకుమారి అవంతిక(తమన్నా) పరిచయం అవుతుంది. ఆమెతో శివుడు ప్రేమలో పడతాడు. ఆమె కోరిక నిమిత్తం అతి క్రూరుడైన భళ్లాలదేవ పాలిస్తున్న మహిష్మతి రాజ్యంలో ఖైదుగా ఉన్న దేవసేన(అనుష్క)ను విడిపించేందుకు వెళతాడు. అక్కడ తాను ఊహించని రీతిలో మార్పులు చోటు చేసుకుని ఆ రాజ్యంతో తనకీ సంబంధం ఉందనే ఆశక్వికరమైన విషయాలు తెలుసుకుంటాడు. అసలీ శివుడు ఎవరు? ఆ రాజ్యంతో శివుడికి సంబంధం ఏంటి? అనేది తెరపై చూడాల్సిన కథ.
నటీనటుల ప్రతిభ
కండలు పెంచిన భారీ శరీరంతోనే కాకుండా మంచి నటనతోనూ ప్రభాస్ ఆకట్టుకుంటాడు. ఆరడుగుల ఆజానుబాహుడైన ప్రభాస్ అచ్చం హాలీవుడ్ హీరోని తలపించాడు. 'బాహుబలి' అంటే ప్రభాసే అనిపించేలా ఉన్నాడు. నెగెటివ్ రోల్ దక్కినా, తన గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా నటనా ప్రతిభ చూపించాడు రాణా. బళ్లాలదేవ పాత్రలో అద్భుతంగా రాణించాడు.తమన్నా తన అందచందాలతో అవంతిక పాత్రతో ఆకట్టుకుంది. గ్లామర్ పరంగా మిల్కీ బ్యూటీ తమన్నా 'అవంతిక'గా ప్రేక్షకులకు ఐ ఫీట్ అనడం నిస్సందేహం.
శివగామి పాత్రలో రమ్యకృష్ణ చెలరేగిపోయింది. 'నరసింహ' తదితర చిత్రాల్లో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన రమ్యకృష్ణ వాటిని మించిన నటనను ఈ సినిమాలో ప్రదర్శించింది. రాజమౌళి అన్నట్టే సినిమా చూసిన వారంతా శివగామి గురించి చర్చించుకుంటున్నారు సినిమా చూశాక. నాజర్, ప్రభాకర్, అడవి శేష్, సత్యరాజ్ వంటివారంతా సినిమాకి హెల్పయ్యారు. పాత్ర నిడివి తక్కువా? ఎక్కువా? అన్నట్టు కాకుండా ఎవరికి దక్కిన పాత్రలో వారు చెలరేగిపోయారు.
సాంకేతిక వర్గం
బాహుబలి బిగినింగ్ అంటూ తొలి భాగాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు రాజమౌళి. సినిమా గురించి ఏదైతే ప్రచారం జరిగిందో ఆ ప్రచారానికి తగ్గట్టుగా టెక్నికల్‌గా సినిమా ఉన్నత స్థానంలో ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాని గుర్తుకు తెస్తాయి. సినిమా చూస్తున్నంతసేపూ హాలీవుడ్ సినిమాలానే అనిపిస్తుంది. సంగీతం బాగుంది, అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా. కానీ ఆ రెండు ఇంకా ఇంకా బెటర్‌గా ఉంటే బాగుండేది. ఎడిటింగ్ బాగుంది. ఇంకాస్త ఎడిటింగ్ అవసరం అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కి వంక పెట్టలేం. విజువల్ ఫీస్ట్ అనిపించేలా సెట్స్ వేసిన ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని స్పెషల్‌గా అభినందించాలి. సినిమా బ్యాక్‌డ్రాప్‌కి తగ్గ విధంగా కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేశారు. అవి చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
విశ్లేషణ
సమ్మర్‌లో రావాల్సిన ఈ సినిమా కాస్త లేటుగా వచ్చినా అభిమానుల్ని నిరాశపరచదు. అంచనాల్ని అందుకుంటుందా? లేదా? అన్న విషయం కొన్ని రోజులు ఆగితేనేగానీ స్పష్టత రాదు. ఫస్టాఫ్ కొంచెం ఎమోషనల్ కంటెంట్‌తో తక్కువ ఉన్నా, సెకెండాఫ్ ఎమోషనల్‌గా సాగుతూ కథలో ఆడియన్స్ లీనమయ్యేలా చేస్తుంది. అయినప్పటికీ సినిమాలో అక్కడక్కడా పేస్ తగ్గినట్లు అనిపిస్తుంది. పెరిగిపోయిన అంచనాల కారణంగా చాలా ఎక్కువగా ప్రేక్షకుడు ఊహించుకోవడం వల్ల ఈ 'పేస్ తగ్గిన' భావన కలుగుతుందేమో. కథ, కథనాలు ఎలా ఉన్నా సినిమాని ఖచ్చితంగా చూడాలని ప్రతి ప్రేక్షకుడూ బలంగా ఫిక్స్ అయిపోయాడు. ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గ గ్రాండ్ లుక్ సినిమాకి ఉండటంతో, ఒక్కసారైనా విజువల్ వండర్‌ని చూడాల్సిందేనని చూసిన ప్రతి ఒక్కరూ ఇంకొకరికి చెబుతారు. సినిమా సక్సెస్ అవడానికి ఇంతకన్నా ఇంకేం టాక్ కావాలి?
ఆఖరి మాట
హాలీవుడ్ మూవీని తలపించిన టెక్నికల్ గ్రాండ్యూర్ 'బాహుబలి'
--మాగల్ఫ్.కాం రేటింగ్: 3.75/5
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







