బహ్రెయిన్ లో ఆహార భద్రతను గురించి కొత్త వ్యూహం

- July 10, 2015 , by Maagulf
బహ్రెయిన్ లో ఆహార భద్రతను గురించి కొత్త వ్యూహం

బహ్రెయిన్ యువరాజు, డేప్యూటీ సుప్రీం కమాండర్ మరియు మొదటి డేప్యూటీ ప్రేమియర్ హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా వారి నిర్దేశానుసారం, ఆహార భద్రతపై, జాతీయ స్థాయిలో వ్యూహరచన కోసం వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సారధ్యంలో ఒక కార్యాచరణ సంఘం ఏర్పాటుచేయనున్నారు. 

ఈ విషయమై వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఆంతరంగిక, ఆరోగ్య, ఆర్ధిక మరియు ఆజమాయిషీ, మునిసిపాలిటీ మరియు పట్టణ ప్రణాళికా వ్యవహారాల శాఖల అధికారులు తొలిసారిగా సమావేశమయ్యారు. సెంట్రల్ ఇన్ఫార్మాటిక్స్ ఆర్గ నై జేషన్ అధికారులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో, ఆహార భద్రతకు సంబంధించిన సూచికల గణన, స్థిరమైన పధకాలను గురించి అంచనాలు తయారు చేశారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com