బెల్టులో పది కిలోల బంగారం స్మగ్గింగ్
- February 06, 2025
న్యూ ఢిల్లీ: బెల్టులో రహస్యంగా బంగారు నాణాలను దాచి తీసుకొచ్చిన ఇద్దరు ప్రయాణికులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మిలాన్ నుంచి వచ్చిన ఈ ప్రయాణికులు ఇద్దరి వద్ద కలిపి మొత్తం పది కిలోల బంగారు నాణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి జరిపిన తనిఖీలలో ఈ స్మగ్గింగ్ దందా బయటపడిందని ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు చెప్పారు.
ఇటలీలోని మిలాన్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు తనిఖీ చేశారు. లగేజీ క్షుణ్ణంగా సోదా చేసినా ఏమీ కనిపించలేదు. దీంతో మరోసారి తనిఖీ చేయగా.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బెల్టులు కనిపించాయని అధికారులు తెలిపారు. వాటిలో రహస్యంగా దాచి తీసుకొచ్చిన బంగారు నాణాలు బయటపడ్డాయని చెప్పారు.
వాటిని తూకం వేయగా 10.092 కిలోలు ఉన్నాయని, మార్కెట్ లో ఆ నాణాల విలువ రూ.7.8 కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు. ఈ బంగారు నాణాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి, ప్రయాణికులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పట్టుబడ్డ ప్రయాణికులు ఇద్దరూ కశ్మీర్ కు చెందిన వారేనని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







