దుబాయ్ ఫౌంటెన్ 5 నెలల పాటు మూసివేత..!!
- February 06, 2025
యూఏఈ: మెరుగైన కొరియోగ్రఫీ, మెరుగైన లైటింగ్, సౌండ్ సిస్టమ్‌ను అందించడానికి సమగ్ర పునరుద్ధరణ కోసం దుబాయ్ ఫౌంటెన్ ఐదు నెలల పాటు మూసివేయనున్నట్లు ఎమ్మార్ ప్రాపర్టీస్ తెలిపింది. దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా సమీపంలో డౌన్‌టౌన్ దుబాయ్‌లో ఉన్న దుబాయ్ ఫౌంటెన్.. యూఏఈలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రతి సంవత్సరం ఫౌంటెన్‌ను వీక్షిస్తారు. యూఏఈలో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ అయిన ఎమ్మార్.. అప్‌గ్రేడ్ మేలో ప్రారంభమవుతుందని తెలిపింది. ఫౌంటెన్ తిరిగి వచ్చిన తర్వాత "మరింత అద్భుతంగా" ఉంటుందని, అప్డేట్ లు మెరుగైన ప్రదర్శనని సృష్టిస్తాయని ఎమ్మార్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలబ్బర్ తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







