ఈద్ అల్ ఫితర్ సెలవులు: దుబాయ్‌లో ఫ్రీ పార్కింగ్
- July 01, 2016
రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ), ఈద్ ఉల్ ఫితర్ సెలవుల సందర్భంగా కస్టమర్ సర్వీస్ సెంటర్స్, కార్ పార్క్‌లు, పబ్లిక్ బస్సులు, దుబాయ్ మెట్రో, ట్రామ్, మెరైన్ ట్రాన్సిట్ మోడ్స్, డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్స్ మరియు వెహికిల్ టెస్టింగ్ రిజిస్ట్రేషన్ సెంటర్ల పనివేళల్ని ప్రకటించింది. ఆర్‌టిఎ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ సెక్టార్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ మోజా అల్ మర్రి మాట్లాడుతూ, 3వ తేదీ ఆదివారం నుంచి 10వ తేదీ ఆదివారం వరకు కస్టమర్ సర్వీస్ సెంటర్ ఆఫ్ డ్యూటీ అని చెప్పారు. ఫిష్ మార్కెట్, మల్టీ లెవెల్ పార్కింగ్ టెర్మినల్ తప్ప మిగతా పెయిడ్ పార్కింగ్ జోన్స్ అన్నీ ఉచితమేనని ఆయన చెప్పారు. జులై 9 నుంచి పార్కింగ్ వసూలు చేయబడుతుందని వివరించారాయన. అలాగే మెట్రో టైమింగ్స్‌నీ, ట్రామ్ సర్వీసుల పనివేళల్నీ వెల్లడించారు. వివిధ సర్వీసుల వివరాల్ని ప్రకటించిన ఆర్‌టిఎ, ఆ వివరాల ప్రకారం ఆయా సేవల్ని రెసిడెంట్స్ పొందవచ్చునని తెలిపింది. సర్వీస్ ప్రొవైడర్స్ మరియు పార్టనర్ సెంటర్స్ జులై 5 మంగళవారం నుంచి 7 జులై గురువారం వరకు మూసివేయబడ్తాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









