తలసేమియా బాధితులకు బాసటగా నారా భువనేశ్వరీ
- February 06, 2025
హైదరాబాద్: తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15న విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్టు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వివరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో ఈ మ్యూజికల్ నైట్ జరగనుంది. విజయవాడలో గురువారం విలేకరుల సమావేశంలో కార్యక్రమాల వివరాలను భువనేశ్వరి, తమన్ వివరించారు.
తలసేమియా బాధితులు శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బంది పడతారని, వారి కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. తమన్ కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా వెంటనే మ్యూజికల్ నైట్ కి వస్తా అన్నారని, తమన్ ఈ షో ఫ్రీ గా చేస్తా అని గొప్ప హృదయంతో చెప్పారని భువనేశ్వరీ తెలిపారు. కార్యక్రమానికి అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హాజరవుతున్నారని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ, తాను ఈ షో చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద కార్యక్రమం తనకు అప్పగించారని అన్నారు.ఈ షో ద్వారా వచ్చే ప్రతి రూపాయి తలసేమియా భాదితులకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







